KKD: దారపల్లి గ్రామ శివాలయం సమీపంలో అర్ధరాత్రి పులి గాండ్రింపులు వినబడడంతో గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యామన్నారు. ప్రస్తుతం దారపల్లి, తాడువాయి గ్రామాల మధ్య దట్టమైన అడవిలో పులి ఉన్నట్లు అధికారులు ధృవీకరణ చేశారు. శంఖవరం, ప్రత్తిపాడు మండలల సరిహద్దు కొండ ప్రాంతంలో పులి కదలికలు గమనించిన అధికారులు ప్రజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.