HNK: ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ వెటర్నరీ హాస్పిటల్ ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తులు మద్యం సేవించి బాటిళ్లు వదిలి వెళ్లారు. పశువుల చికిత్స కోసం నిర్మించిన ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరగడం గురువారం గ్రామస్థులను ఆవేదనకు గురిచేస్తింది. హాస్పిటల్ భద్రత కోసం తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల అధికారులను కోరుతున్నారు.