AP: నెల్లూరు జిల్లాలో అటానమస్ మారిటైం షిప్ యార్డుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయడం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి నారాయణ అన్నారు. ప్రపంచంలోనే తొలి తరహా కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుందని పేర్కొన్నారు. స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనుందని, సముద్ర సాంకేతికతలో నూతన ఆవిష్కరణలకు ఊతమివ్వనుందని చెప్పారు. తీరప్రాంత పర్యవేక్షణ మరింత బలపరుస్తుందన్నారు.