AP: రాష్ట్రంలో రికార్డు స్థాయి విద్యుదుత్పత్తిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. విద్యుదుత్పత్తిలో ఏపీ జెన్కో 6,101 మెగావాట్లతో రికార్డు సృష్టించింది. సీఎం సలహాలు, సూచనలతోనే ఈ రికార్డు సాధ్యమైందని తెలిపారు. ఇంజినీర్లు, అధికారుల అంకితభావం, నైపుణ్యం, కృషితోనే సాధ్యమన్నారు. గృహ, పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యమన్నారు.