NLR : బుచ్చి మండలం సాల్మాన్పురం గ్రామంలో వెలిసిన మౌలాలి బాబా దర్గాలో స్వామివారి గంధ మహోత్సవం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు వచ్చి గంధమోత్సవం పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. గంధ మహోత్సవం సందర్భంగా దర్గాను పరిమళ పుష్పాలతో అలంకరించారు. టీడీపీ నేత సుర శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.