WGL: నగరంలోని కేఎంసీలో ఫార్మకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. దయాకర్ కు తెలంగాణ వైద్య మండలి నోటీసులు జారీ చేసింది. అర్హతలను తప్పుగా చూపించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ప్రాక్టీస్‌లో ఎండీ జనరల్ మెడిసిన్, కార్డియాలజీ అర్హతలు ఉన్నట్లు పేర్కొనడంపై వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని మండలి పేర్కొంది.