MHBD: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా తొర్రూరు మండలం అమ్మాపురం ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని వాటర్ ట్యాంక్‌ను, పరిసరాలను గ్రామపంచాయతీ సిబ్బందితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యమని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయించి నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టమని సర్పంచ్ తెలిపారు.