KDP: ప్రభుత్వం PM కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. ఈ నెల13న కృష్ణా జిల్లా గన్నవరంలో CM చంద్రబాబు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,808 కోట్లు జమ చేయనున్నారు. PM కిసాన్ కింద రూ. 2వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4,000 కలిపి మొత్తం రూ.6,000 రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. PM కిసాన్ డబ్బులు రావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలి.