KDP: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 308 కేసులు నమోదు చేసి.. రూ.74,425 జరిమానా విధించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.