W.G: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ డిమాండ్ చేశారు. బుధవారం పాలకొల్లులో 14వ రోజుకు చేరిన ప్రజా చైతన్య పాదయాత్రలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని వీధివీధినా పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వృద్ధులకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.