WGL: మహిళల సాధికారత, సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న నర్సంపేట మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మి రామానంద్ను కస్తూర్బా మహిళా మండలి సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కోసం తాను కృషి చేస్తానని ఛైర్మన్ తెలిపారు. మహిళల్లో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు.