అన్నమయ్య: పీటీఎం మండలం టీ. సదుంకు చెందిన 19 ఏళ్ల మధు బుధవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నారాయుడిపల్లికి బైక్పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇచ్చే క్రమంలో బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ఘటనలో మధుకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.