CM Jagan:చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ (CM Jagan) విమర్శలు చేశారు. టిడ్కో ఇళ్లలో చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. ఆయన పేదల వ్యతిరేకి అని మండిపడ్డారు. తన బినామీ భూముల రేట్ల కోసం.. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించానని గుర్తుచేశారు. అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించామని తెలిపారు. 30 ఏళ్ల క్రితం సీఎం అయిన చంద్రబాబు ఎందుకు చేయలేదని అడిగారు. 14 ఏళ్లు సీఎం అయి కూడా ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రజలపై భారం మోపారని సీఎం జగన్ (CM Jagan) ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని పేర్కొన్నారు. పెన్షన్ రూపంలో 72 వేల కోట్ల ఇచ్చామని గుర్తుచేశారు. 31 వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కింద ఇచ్చామని తెలిపారు. అమ్మ ఒడి.. తదితర పథకాల కోసం కోట్ల నిధులను ఖర్చు చేశామని చెప్పారు.
టిడ్కో ఇళ్ల సముదాయం ప్రారంభం
కృష్ణా జిల్లా గుడివాడ మునిసిపాలిటీ పరిధిలోని మల్లాయపాలెంలో 77 ఎకారాల్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్ల సముదాయాన్ని సీఎం వైఎస్ జగన్క్రితం ప్రారంభించారు. టిడ్కో ఇళ్ల సముదాయం ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ప్రభుత్వం నిర్మిస్తున్నవి జగనన్న కాలనీలు కావని, ఊర్లని అన్నారు. వీటి నిర్మాణంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామన్నారు. ఈ కాలనీల్లో 16,240 కుటుంబాలు నివసిస్తాయని పేర్కొన్నారు. గుడివాడలో ఇచ్చిన హామీని నిజం చేసి చూపించామన్నారు. ఇంటి స్థలం విలువను రెండున్నర లక్షల రూపాయలు అనుకున్నా, ఇల్లు కట్టడానికి రూ. 2.70 లక్షలు ఖర్చు, మౌలిక సదుపాయల నిర్మాణానికి రూ. లక్ష ఖర్చు వేసుకున్నా ప్రతి ఇంటి విలువ దాదాపు రూ. 10 లక్షలు అవుతుందన్నారు. గుడివాడలో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నాడని, పేదోడికి ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాము 30.60 లక్షల పట్టాలు ఇచ్చామన్నారు. రెండు దశల్లో 21 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పుకొచ్చారు. రూ. 75 వేల కోట్ల ఆస్తులను పట్టాల రూపంలో ఇచ్చినట్టు సీఎం వివరించారు. అంతకుముందు సీఎం జగన్కు మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి జోగి రమేశ్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు పేర్నినాని తదితరులు ఘన స్వాగతం పలికారు.
కుప్పంలో మైక్ పట్టుకొని
కుప్పంలో మైక్ పట్టుకొని.. ఇంకో ఛాన్స్ ఇవ్వాలని చేసేస్తా అని చంద్రబాబు అంటారని సీఎం జగన్ (CM Jagan) మండిపడ్డారు. కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానని అంటారని సెటైర్లు వేశారు. ప్రజలను మోసం చేయడానికి బయల్దేరారని గుర్తుచేశారు. ఇంకోసారి ఇవ్వాలని కోరతారే తప్ప.. మంచి చేశానని ఓటు వేయమని అడగలేడని పేర్కొన్నారు. ఇంతమందికి ఇళ్లు కట్టించానని.. ఓటు వేయమని అడలేదని వివరించారు. ఏ సామాజిక వర్గానికి కూడా మంచి చేయలేదని దుయ్యబట్టారు. పిల్లలను కూడా విస్మరించారని జగన్ దుమ్మెత్తి పోశారు. అక్కాచెల్లెళ్లకు మంచి చేశానని.. ఓటు వేయమని అడగడం లేదన్నారు. ప్రాంతానికి మంచి చేశానని అనడం లేదని.. మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని మండిపడ్డారు.
6 నెలల్లోనే..
30 ఏళ్ల క్రితమే సీఎం అయినా.. 3 సార్లు సీఎం పదవీ చేపట్టినా.. 14 ఏళ్లు సీఎం పదవీ చేపట్టినప్పటికీ.. మంచి చేయలేదన్నారు. అందుకే చేసిన పనుల గురించి అడగడం లేదని చెప్పారు. లంచాలకు తావు ఉండకూడదని, అధికారంలోకి వచ్చిన 6 నెల్లో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని జగన్ (CM Jagan) తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్, నాడు- నేడుతో పాఠశాలల రూపు రేఖలు మారాయని చెప్పారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం, 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నామని వివరించారు.