సింహాచలం సింహాద్రి అప్పన్న నిత్య అన్న ప్రసాదానికి శ్రీకాకుళానికి చెందిన మేడూరి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు రూ.1,00,000 విరాళం అందించారు. ఈ విరాళాన్ని బుధవారం ఆలయ పీఆర్వో కార్యాలయంలో ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి ఏ. త్రిమూర్తులకు నగదు రూపంలో అందజేశారు. దాతకు దేవస్థానం అధికారులు స్వామివారి దర్శనం కల్పించి, ప్రసాదాలు అందించారు.