అన్నమయ్య: తంబళ్లపల్లి MPDO కార్యాలయంలో ఇవాళ జరిగే మండల సర్వసభ్య సమావేశానికి ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులతో పాటు టీడీపీ నేతలకు అనుమతి ఇవ్వాలని ఎంపీడీవో బాపూజీ పట్నాయక్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు టీడీపీ మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, ఇతర నేతలకు అనుమతి ఇవ్వాలని కోరగా ఆయన ఆమోదించారు.