MBNR: పరస్పర ప్రేమాభిమానాలకు రంజాన్ పండగ ప్రతీకగా నిలుస్తుందని మహబూబ్నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన పలు ఇఫ్తార్ వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.