AKP: కేజీబీవీల్లో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు బుధవారం తెలిపారు. 6,11వ తరగతులు ప్రవేశాలతో పాటు 7,8,9,10,12 తరగతుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఈనెల 12 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అనాథలు, బడి బయట ఉన్నవారు, డ్రాప్ అవుట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అర్హులుగా పేర్కొన్నారు.