రిలీజ్ డేట్: 23-12-2022
నటీనటులు: రవితేజ, శ్రీలీల, జయరామ్, పవిత్రా లోకేష్, రావు రమేష్, తనికెళ్ళ భరణి, సచిన్ ఖేడేకర్, తులసి, అలీ, హైపర్ ఆది, ప్రవీణ్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
కెమెరా: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
గతేడాది క్రాక్ సినిమాతో మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. అయితే ఈ ఏడాదిలో వచ్చిన రెండు సినిమాలు.. ‘ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ’ డిజాస్టర్‌గా నిలిచాయి. దాంతో ఈ ఇయర్ ఎండింగ్లో మరోసారి ధమాకా మూవీతో లక్ చెక్ చేసుకున్నాడు రవితేజ. గతంలో డైరెక్టర్ త్రినాథరావు, రైటర్ ప్రసన్నకుమార్ కాంబినేషన్లో వచ్చిన కొన్ని సినిమాలు హిట్‌గా నిలవడంతో.. ధమాకా ఆసక్తికరంగా మారింది. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ సినిమా పై.. ప్రమోషన్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేశారు. ఎట్టకేలకు ధమాకా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ధమాకా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా.. రవితేజ బౌన్స్ బ్యాక్ అయ్యాడా.. సినిమా ఎలా ఉంది!?
కథ:
ధమాకా కథ విషయానికొస్తే.. సినిమా స్టార్టింగ్‌లోనే రవితేజ చనిపోయినట్టు.. అతని బాడీని మార్చురీలో పడేసినట్టు.. చూపించారు. ఆ తర్వాత మాస్ రాజా ఫైట్‌తో ఎంట్రీ ఇచ్చాడు. అతని పేరు స్వామి. వాళ్లది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అతని తండ్రి తనికెళ్లభరణి. రవితేజకు ఓ చెల్లెలి ఉంటుంది. ఆమెకు పెళ్లి చేయాలనుకుంటున్న సమయంలో.. రవితేజ జాబ్ పోతుంది. దాంతో లోన్ క్యాన్సిల్ అవుతుంది. జాబ్ కోసం ట్రై చేస్తుండగా.. రవితేజ చెల్లెలి ఫ్రెండ్‌గా శ్రీలీల పరిచయం అవుతుంది. ఆమె పేరు ప్రణవి.. ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయాడు రవితేజ. ఆ విషయం అమ్మాయితో చెప్పి.. ఓ ఫైట్‌తో ఆమె ముందు హీరో అయిపోయాడు. ఈ సమయంలో శ్రీలీల తండ్రి రావు గోపాల్ రావు.. శ్రీలీలకు మరో సంబంధం సెట్ చేశాడు. అతను మరెవరో కాదు.. రవితేజ లాగా ఉండే ఆనంద్.. ఈ విషయం తెలియని ప్రణవి పెళ్లికి ఒప్పుకుంటుంది. అయితే ఆ తర్వాత ఇద్దరు ఒకేలా ఉన్నారని తెలుసుకున్న ప్రణవి.. వాళ్లమ్మ సలహాతో ఇద్దరితోనూ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. మరోపక్క జెపి (జయరామ్) తన కుమారుడి కోసం పీపుల్స్ మార్ట్‌ను వశం చేసుకోవాలని ట్రై చేస్తుంటాడు. ఇలాంటి సమయంలో.. ప్రణవి తండ్రి, మరియు జపి ఒకేసారి ఇటు ఆనంద్, అటు స్వామిని చంపేందుకు ప్రయత్నించగా.. అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. మరి స్వామి, ఆనంద్‌కు అసలు సంబంధం ఏంటి.. నిజం తెలిశాక శ్రీలీల ఏం చేసింది.. జేపీని ఎదిరించేందుకు ఆనంద్, స్వామి ఏం చేశారు.. చివరికి ఏమైంది.. అనేది తెలియాలంటే.. తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే.. క్రాక్ మూవీ తర్వాత ట్రాక్ తప్పిన రవితేజ.. ధమాకాతో సక్సెస్ ట్రాక్ ఎక్కడానే చెప్పాలి. ముందు నుంచి ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం పక్కా అని ప్రచారం చేశారు మేకర్స్. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తోనే.. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలిసిపోయింది. అందుకు తగ్గేట్టే సినిమా మొత్తం ఫన్ డోస్ ఇచ్చేలానే ఉంది. రవితేజ ఫ్యాన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ ధమాకాలో ఉంది. కాకపోతే కథ, కథనంలో కొత్తదనం లేదు.. కానీ ట్రీట్మెంట్ కొత్తగా ట్రై చేశారు. రొటీన్ స్టోరీ అని పెదవి విరుస్తున్నా.. రవితేజ వింటేజ్ లుక్ చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ శ్రీలీల గురించి. సగం ఏజ్ గ్యాప్ ఉన్న హీరోయిన్‌తో మాస్ రాజ్ పెయిర్ ఎలా ఉంటుందోనని అనుకున్నారు అంతా. కానీ రవితేజకు పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది శ్రీలీల. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. మాస్ రాజా ఎనర్జటిక్ పెర్ఫామెన్స్‌కు శ్రీలీల గ్లామర్ మరింత ప్లస్ అయ్యింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో థియేటర్లో విజిల్ వేయిస్తున్నాడు. రావు రమేష్, హైపర్ ఆది కామెడీ ట్రాక్ కూడా సినిమాకు హైలెట్‌గా నిలిచింది. అయితే సెకండాఫ్‌లో కొన్ని లాజిక్ లేకుండా వచ్చే సన్నివేశాలు, ల్యాగ్‌ను పట్టించుకోకపోతే ధమాకాను ఒక్కసారి ఎంజాయ్ చేయొచ్చు.
ప్లస్ పాయింట్స్:
రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్.. భీమ్స్ సిసిరోలియో మాస్ బీజిఎం అండ్ సాంగ్స్, శ్రీలీల డ్యాన్స్ అండ్ గ్లామర్ షో.. హైపర్ ఆది కామెడీ
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ, కథనం.. సెకండ్ హాఫ్‌లో లాజిక్ లేని సీన్స్