KKD: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జేసీ అపూర్వ భరత్ బుధవారం తెలిపారు. గ్యాస్ సరఫరాపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే 8886903611 నంబర్‌కు తెలపాలని సూచించారు. గల్ఫ్ యుద్ధం వల్ల గ్యాస్ ధరలు పెరుగుతాయన్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.