NTR: మైలవరం సర్కిల్ పరిధిలోని జి. కొండూరు జంక్షన్ వద్ద నేషనల్ హైవేపై వన్‌వే ఉల్లంఘిస్తూ ట్రాఫిక్‌కు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న హెవీ ట్యాంకర్ లారీలపై పోలీసులు చర్యలు చేపట్టారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, ఎస్సై సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రెండు ట్యాంకర్ లారీలను స్వాధీనం చేసుకుని డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సీఐ కిషోర్ బాబు తెలిపారు.