TG: పశ్చిమాసియాలో కొనసాగుతోన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారని, వీటిపట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.