NLG: మాల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దొంతం అలివేలు సంజీవ్ రెడ్డి సోదరుడు దొంతం సత్యనారాయణరెడ్డి మృతి బాధాకరం అని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. శుక్రవారం సత్యనారాయణరెడ్డి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళిర్పించారు. బాధిత కుటుంబానికి పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.