KNR: జమ్మికుంట MPDO కార్యాలయంలో శుక్రవారం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పద్మావతి తెలిపారు. జనవరి 2న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో మండలంలోని 20 గ్రామాలకు చెందిన 16వ విడత పనులపై విచారణ జరగనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పథకానికి వచ్చిన నిధులు, నివేదికలను పరిశీలించనున్నారు.