HNK: హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన సంవత్సరం సందర్భంగా కలెక్టరేట్లో ఇవాళ నిర్వహించిన అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో ఆమె తొలి సంతకం చేసి అవినీతికి పాల్పడనంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, లోక్ సత్తా సభ్యులు పాల్గొన్నారు.