NGKL: ఊర్కొండ మండలం ఊర్కొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్, ఈఓ, పాలక మండలి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు సకాలంలో పాల్గొని పారదర్శకంగా లెక్కింపు జరిగేలా సహకరించాలని వారు కోరారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.