TPT: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదం మరింత సౌకర్యవంతంగా పొందేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రసాద విక్రయ కేంద్రం వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఇక్కడ చంటి పిల్లలు కలిగిన భక్తులకు ప్రాధాన్యం ఉంటుంది. రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.