సత్యసాయి: మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం బుధవారం నుంచి అమలులోకి రానుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్థానిక ప్రజల విన్నపాన్ని ప్రభుత్వం మన్నించడంతో మడకశిర ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ డివిజన్‌ను ఏర్పాటు చేశారు.