BHNG: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు నా కోసం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారు బొకేలు, పుష్ప గుచ్చాలు, శాలువాలు తీసుకు రావద్దని జిల్లా కలెక్టర్ హనుమంత రావు పిలుపునిచ్చారు. వాటికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, దుప్పట్లు ఇతర సామగ్రి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.