సత్యసాయి: కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లు సుమారు 2 కిలోమీటర్ల మేర సాగాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.