BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఇవాళ SI MD షాఖాన్ మండల పరిధిలోని DJ నిర్వాహకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షా ఖాన్ మాట్లాడుతూ.. పోలీసు అనుమతి లేకుండా DJలు ఏర్పాటు చేయరాదని, డిసెంబర్ 31న ఎటువంటి DJలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీజేలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.