CTR: నగరి మున్సిపల్ ఛైర్మన్ పీజీ నీలమేఘం అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. రానున్న ఏడాదిలో రూ.45.19 కోట్ల రాబడి ఉంటుందని అధికారులు అంచనా బడ్జెట్ రూపొదించారు. రూ.30 కోట్ల ఖర్చులు అవుతాయని అంచనా వేశారు. అధికంగా తిరుగుతున్న టిప్పర్లతో పలు సమస్యలు ఏర్పడుతున్నట్లు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.