సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. ప్రపంచ దేశాలపై మళ్లీ 10 శాతం టారిఫ్లు విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ టారిఫ్లు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ వెల్లడించింది. ఈ సుంకాలు 150 రోజులపాటు అమలులో ఉంటాయని తెలిపింది.