KRNL: ఆదోనిలో రైతు తిమ్మప్ప వద్ద రూ.1.70 లక్షల నగదు దొంగలు కాజేశారు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న ఈ డబ్బును ఆయన ద్విచక్ర వాహనం సైడ్ బ్యాగులో ఉంచుకున్నారు. ప్రభాకర్ థియేటర్ సమీపంలో ట్రాఫిక్‌లో నిలిచిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బ్యాగులోని నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో ఇవాళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.