RR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా బుధవారం షాద్నగర్ మున్సిపాలిటీ పదవ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్, కౌన్సిలర్ శ్రావణి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలు భూమిపై మనుగడ సాగించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.