KMM: సీపీఐ జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవన్లో పార్టీ 101వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు హేమంత్ ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది సీపీఐ మాత్రమేనని స్పష్టం చేశారు.