NZB: వర్ని ఎస్సైగా వంశీకృష్ణ గురువారం పదవీ బాధ్య తలు చేపట్టారు. ఇది వరకు వర్ని ఎస్పైగా పని చేసిన మహేశ్ సీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. ఎడపల్లి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వంశీకృష్ణను వర్ని ఎస్సైగా బదిలీ చేశారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.