సత్యసాయి: కదిరి శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో డిసెంబర్ 30న జరిగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎన్. సతీష్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 25న ఆలయాన్ని సందర్శించి, భక్తులకు క్యూ లైన్లలో ఇబ్బందులు లేకుండా త్వరిత దర్శనానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.