JN: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నెల్లుట్ల గ్రామం నుంచి లింగాల ఘనపూర్ వెళ్లే రహదారిలో గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను జేసీబీలతో క్లీన్ చేయించారు. గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ మాట్లాడుతూ… గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని, గ్రామంలోని ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.