GDWL: రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారి మధుబాబు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్, స్త్రీల వ్యాధులు, శిశువుల ఆరోగ్యం, ఎముకలు కీళ్ల సమస్యల నిపుణులు రోగులను పరీక్షిస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.