BDK: బూర్గంపాడు మండలం నకిరిపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర విషయాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువు గురించి అడిగి తెలుసుకున్నారు.