IPL 2026 టోర్నీ వాయిదా పడుతుందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం, హోటళ్లలో గ్యాస్ కొరత, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో IPL నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. విమాన సర్వీసుల్లో అంతరాయంతో విదేశీ ఆటగాళ్లు రావడంపైనా అనుమానాలు ఉన్నాయి. పరిస్థితిని గమనిస్తున్నామని, ఇప్పటికైతే ఏం చెప్పలమేని, సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని IPL ఛైర్మన్ అరుణ్ తెలిపారు.