KDP: వేసవి నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ఇటీవలే జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎర్రగుంట్ల పట్టణంలో నీటి కొరత ఉన్నట్లు అధికారులు తెలిపిన గణాంకాల్లో తెలుస్తోంది. ఎర్రగుంట్ల పట్టణంలోని 20 వార్డులు 36,800 జనాభాకు నిత్యం 4.96 LMD నీటి అవసరం ఉందని, ప్రస్తుతం 3.75 LMD సరఫరా చేయగా.. ఇంకా 1.21 LMDల కొరత ఉన్నట్లు అధికారులు నివేదిక సమర్పించారు.