శ్రీకాకుళం మండలం ప్రధాన రహదారిలో ఉన్న డెంటల్ కాలేజీ వద్ద లారీ ఆగి ఉన్న కారును ఢీకొంది. బుధవారం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కారు మరమ్మతులకు గురికావడంతో కారులో ఉన్నవారు దిగి మెకానిక్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఈ సమయంలోనే నరసన్నపేట నుండి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.