NRPT: మక్తల్ మండలం మంతన్ గౌడ్ గ్రామంలో 40 ఏళ్లుగా వనజమ్మ కుటుంబానికే సర్పంచ్ పదవి దక్కుతోంది. నాటి సర్పంచ్ శకుంతలమ్మ నుంచి ఆమె మనవడు రాజేందర్ గౌడ్ వరకూ గ్రామాభివృద్ధికి నాయకత్వం వహించారు. రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు వంటి మౌలిక వసతులు అభివృద్ధి చేశారు. తాజాగా ఎన్నికైన రాజేందర్ గౌడ్ వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.