పశ్చిమాసియా యుద్ధం వల్ల చమురు ధరలు పెరగడంతో థాయ్లాండ్, వియత్నాం దేశాలు పొదుపు మంత్రం జపిస్తున్నాయి. ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని, వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తున్నాయి. ప్రజలు వ్యక్తిగత వాహనాలు తగ్గించి సైకిళ్లు, బస్సులు వాడాలని సూచించాయి. అంతర్జాతీయ పరిస్థితులు మెరుగుపడే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ఆ దేశాలు స్పష్టం చేశాయి.