WGL: ఇంటి పన్ను కట్టలేదని అధికారులు గ్యాస్ సిలిండర్ స్వాధీనం చేసుకున్న ఘటన కాశీబుగ్గలో జరిగింది. గొలుసుల సుజాత అనే మహిళ ఇంటి పన్ను చెల్లించాల్సి ఉందని గతనెల 23న GWMC అధికారులు నోటీసు ఇచ్చారు. నిన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ సోహైల్‌తో పాటు ఆరుగురు సిబ్బంది సుజాత ఇంటికి వచ్చి, బలవంతంగా సిలిండర్ తీసుకెళ్లారు. అయితే ఆమె రూ.5,280 పన్ను చెల్లించి, సిలిండర్ తెచ్చుకుంది.