SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పెరుక శ్రీనివాస్ లక్ష్మీల కుమారుడు అజయ్ పీజీ వరకు చదివి, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి, వేములవాడలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అజయ్ గ్రామంలో హామాలి కార్మికుడిగా పనిచేస్తూ, గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమై, జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు.