కృష్ణా: రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణాను అడ్డుకోవడం, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గుడివాడలో ట్రాఫిక్ ఎస్సై నాగరాజు ఇవాళ వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన అన్ని వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ పొల్యూషన్ ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.