TG: నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పులి పాదముద్రలను గట్టుపొడిచిన వాగు వద్ద అటవీ అధికారులు గుర్తించారు. ఈ పులి ఇనాయత్నగర్, మాల్యాల, చందుర్తి అటవీ ప్రాంతాల మీదుగా కదులుతూ ట్రాప్ కెమెరాలకు చిక్కింది. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.