ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో దర్శకుడు అట్లీ క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ను గ్లింప్స్ ద్వారా ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఈ టైటిల్ లాంచ్ ఈవెంట్కు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ అతిథిగా రానున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.